Mallikarjun Kharge : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని చీల్చే కుట్రలు చేస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ అణచివేతకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కర్ణాటకలోని కల్బురిగి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ— వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం కేసులో ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల ఇళ్లపై ఈడీ దాడులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “ఇది బహిరంగ రాజకీయ వేధింపులు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు మోదీ ప్రభుత్వం ఈడీ, ఐటీ, సీబీఐలను ఆయుధాలుగా ఉపయోగిస్తోంది. అయినా కాంగ్రెస్ పార్టీలో చీలికే ప్రసక్తిలేదు. మేమంతా ఐక్యంగా ఉన్నాం,” అని ఖర్గే స్పష్టం చేశారు.
AP News : ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు పేర్ని నాని, కిట్టు..
పదకొండేళ్ల మోదీ పాలనపై ధ్వజమెత్తిన ఖర్గే— “ఈ పాలనలో మోదీ సర్కార్ 33 దోషాలు చేసింది. యువతను ఆశలతో మోసగించింది. మోదీ చెప్పిన వాగ్దానాల్లో అన్నీ అబద్ధాలే. నా రాజకీయ జీవితంలో ఇంత అబద్ధాల ప్రధానిని చూడలేదు,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇప్పటికీ ఖాళీగా ఉంచడాన్ని కూడా ఖర్గే తప్పుబట్టారు. “గతంలో యూపీఏ సర్కార్ ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చింది. కానీ మోదీ ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని విస్మరించింది. ఈ విషయంలో అనేకసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదు. ఇది మోదీకి ప్రజాస్వామ్యంపై ఉన్న అభిమానం ఏ స్థాయిలో ఉందో చూపిస్తుంది,” అని విమర్శలు గుప్పించారు.
RCB For Sale: అమ్మకానికి ఆర్సీబీ.. రూ. 17 వేల కోట్లు ఫిక్స్ చేసిన జట్టు యజమాని?!