మామిడి ఒరుగులతో లక్షల్లో ఆదాయం.. ఎలానో తెలుసా?

  • Written By:
  • Publish Date - June 11, 2022 / 03:27 PM IST

సీజనల్‌గా దొరికే మామిడి కాయలతో అనూష అని ఒక మహిళ ఏకంగా లక్షలు సంపాదిస్తోంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఖమ్మం జిల్లా మండాలపాడు వాసి రావిలాల అనూష అనే వివహిత ఏడేళ్ల క్రితం 15  వేల రూపాయలతో ఈ మామిడి ఒరుగుల వ్యాపారాన్ని మొదలుపెట్టిన అనూష నేడు 30 మంది మహిళలకు ఉపాధి కల్పించింది.  అయితే మొదటి ఏడాది అనూష,రామకృష్ణ కలిసి 15వేల రూపాయలతో మామిడికాయలను కొనుగోలు చేశారట.

అయితే అనూష వాళ్ళ బంధువుల నాలుగు మామిడి చెట్ల నుంచి 2 టన్నుల వరకు మామిడి కాయలు సేకరించి, ముక్కలు కోసి ఎండబెడితే ఏడు సంచులు అయ్యాయి. వాటిని అమ్మాము. ముందు మా కుటుంబమే ఈ పనిలో నిమగ్నమైంది. తర్వాత తర్వాత పనికి తగినట్టు ఇతరులను పనిలో పెట్టుకున్నం. ఆ యేడాది లక్ష రూపాయల ఆదాయం వరకు చూశాం అని తెలిపారు. తర్వాత ఏడాది ఇంకాస్త ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, ఇరవై క్వింటాళ్ల ఒరుగులు తయారుచేసి నిజామాబాద్‌ తీసుకెళ్లి మార్కెట్‌ చేశాం అని చెప్పుకొచ్చింది అనూష.