KCR-KTR: ఖమ్మం మాజీ DCMS ఛైర్మన్ మృతి.. కేసీఆర్, కేటీఆర్ సంతాపం

KCR-KTR: ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల శేషగిరిరావు మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ కు ఆయన విశేష సేవలందింరు. ఆయన మృతి వల్ల బీఆర్ఎస్ కు, ఖమ్మం జిల్లాకు తీరని లోటు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి రావు మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారితో దశాబ్దాలకాలంగా తనకున్న రాజకీయ అనుబంధాన్ని, పలు పదవుల ద్వారా రైతాంగం కోసం, ప్రజలకోసం, […]

Published By: HashtagU Telugu Desk
Brs Leader

Brs Leader

KCR-KTR: ఖమ్మం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ రాయల శేషగిరిరావు మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ కు ఆయన విశేష సేవలందింరు. ఆయన మృతి వల్ల బీఆర్ఎస్ కు, ఖమ్మం జిల్లాకు తీరని లోటు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి రావు మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారితో దశాబ్దాలకాలంగా తనకున్న రాజకీయ అనుబంధాన్ని, పలు పదవుల ద్వారా రైతాంగం కోసం, ప్రజలకోసం, పార్టీ కోసం శేషగిరిరావు చేసిన కృషిని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కేటీఆర్ సంతాపం

ఖమ్మం మాజీ DCMS ఛైర్మన్ రాయల శేషగిరి రావు గారి మృతి పట్ల బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన కేటీఆర్ ,వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు

  Last Updated: 15 May 2024, 10:14 PM IST