Site icon HashtagU Telugu

Khajuraho Express Fire: ఉదయ్‌పూర్‌-ఖజురహో ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

Khajuraho Express

New Web Story Copy (34)

Khajuraho Express Fire: ఉదయ్‌పూర్‌ నుంచి ఖజురహో వెళ్తున్న ఉదయ్‌పూర్‌-ఖజురహో ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటన వెలుగు చూసింది. గ్వాలియర్‌లోని సిథోలి స్టేషన్ సమీపంలో రైలు ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంటలను గుర్తించిన వెంటనే లోకో పైలట్ సిథౌలీ సమీపంలో రైలును ఆపి కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఉదయపూర్ ఖజురహో ఎక్స్‌ప్రెస్ గ్వాలియర్ స్టేషన్‌కు కాస్త లేటుగా వచ్చింది. 12.14 నిమిషాలకు బదులుగా 12.35 నిమిషాలకు ఆలస్యంగా చేరుకుంది. దీని తర్వాత రైలు 12.45 గంటలకు ఝాన్సీకి బయలుదేరింది. గ్వాలియర్ స్టేషన్‌కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిథోలి స్టేషన్‌కు చేరుకోగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన వెంటనే లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. అనంతరం కంట్రోల్‌ రూంకు సమాచారం అందించారు.

Also Read: MLA Vamsi Mohan : ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ కాన్వాయ్‌కి ప్ర‌మాదం.. తృటిలో త‌ప్పిన పెను ప్ర‌మాదం