Site icon HashtagU Telugu

Khairatabad : ఖైరతాబాద్ గ‌ణేష్ ఉత్స‌వ క‌మిటీ ఛైర్మ‌న్ క‌న్నుమూత‌

Khairatabad

Khairatabad

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ క‌న్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో 1954లో ఖైరతాబాద్‌లో తొలిసారి ఒక అడుగు వినాయకుడిని ప్రతిష్టించారు. ఆ తర్వాత ఏటా ఒక్కో అడుగు పెంచుతూ 2014 నాటికి 60 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత శోభయాత్ర నిబంధనలతో వినాయకుడి ఎత్తును పెంచడం ఆపేశారు. గ‌త నెల‌లో జ‌రిగిన వినాయ‌క ఉత్స‌వాల్లో ఆయ‌న చురుకుగా పాల్గొన్నారు. ద‌గ్గ‌రుండి అన్ని ఏర్పాట్లును చేశారు. అయితే అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన సుద‌ర్శ‌న్ ఈ రోజు మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు.