Vijaya Reddy: రేవంత్ ఆకర్ష్.. కాంగ్రెస్ లోకి పీజేఆర్ కూతురు!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. ఆయన ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - June 18, 2022 / 11:34 AM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. ఆయన ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన విషయం తెలిసిందే. ముందస్తు ఎన్నికలకు ముందు చేరికలపై ఫోకస్ చేస్తూ కాంగ్రెస్ బలోపేతానికి పాటుపడుతన్నారు. తాజాగా దివంగత పీజేఆర్ కూతురు, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. శనివారం ఉదయం రేవంత్ నివాసానికి వెళ్లిన ఆమె సంప్రతింపులు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

‘కాంగ్రెస్‌ కోసం పీజేఆర్‌ ఎంతో పనిచేశారు. కాంగ్రెస్‌లో మంచి భవిష్యత్‌ ఉంటుందని నమ్ముతున్నా. చాలా రోజుల నుంచి రేవంత్‌రెడ్డితో చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌. టీఆర్‌ఎస్‌లో పరిస్థితులు బాగాలేవు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీయే. పీజేఆర్‌ కూతురిగా టీఆర్‌ఎస్‌లో ఉండలేకపోతున్నా. నాన్నగారి ఆదర్శాలను మరింత ముందుకు తీసుకెళ్లుతా. టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేక పార్టీని వీడాల్సి వస్తోంది’’ అని విజయారెడ్డి స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఏరియా నుంచి విజయారెడి టీఆర్ఎస్ లో కీలకంగా పనిచేస్తోంది. కార్పొరేటర్ గా పార్టీకి సేవలందించింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన ఆమె మేయర్ రేసులోనూ నిలిచింది. అయితే అనివార్య కారణాల వల్ల మేయర్ పదవికి దూరమైంది. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకొని భంగపడ్డారు కూడా. విజయారెడ్డి టీఆర్ఎస్ ను వీడుతుండటం గట్టి దెబ్బ తగిలిందని చెప్పక తప్పదు.