TS TET 2022: రేపే టెట్ పరీక్ష…ఏర్పాట్లు పూర్తి…కీలక సూచనలివే..!

టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఈనెల 12వ తేదీన టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. అదే రోజు RRB పరీక్ష కూడా ఉండటంతో టెట్ వాయిదా వేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - June 11, 2022 / 07:15 AM IST

టెట్ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఈనెల 12వ తేదీన టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. అదే రోజు RRB పరీక్ష కూడా ఉండటంతో టెట్ వాయిదా వేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. అయితే అనుకున్న ప్రకారమే టెట్ 12వ తేదీని నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం. ఆదివారం రోజు టెట్ నిర్వహించనుండటంతో డైరెక్టర్ SCERT, కన్వీర్ TS-TET 2022కీలక ప్రకటన చేశాయి. మొత్తం 33 జిల్లాల్ో రెండు సెషన్స్ లో టెట్ జరగనుంది. పేపర్ -1 ఉదయం, పేపర్ -2 సాయంత్రం ఉంటుందని..పేపర్ 1 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00వరకు ఉండనుంది. పేపర్ 2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాగా ఈ పరీక్షకు 3,80,589మంది దరఖాస్తుదారులలో 3,61,205 మంది ఇప్పటి వరకు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకున్నట్లు తెలిపారు.

కాగా టెక్ నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,683కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6,29,352మంది అభ్యర్థులు హాజరుఅవుతున్నట్లు టెట్ కన్వీనర్ తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాల్లో ఒక ఏఎన్ఎం అవసరమైన వైద్య సహాయం అందించేందుకు…ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇతర ప్రథమ చికిత్స మందులను వైద్యశాఖ అవసరమైన చర్యలు తీసుకుంది. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవడానికి ఏర్పాట్లు చేయడంతోపాటు స్టోరేజీ పాయింట్ల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్ష సజావుగా సాగేలా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి పరీశీలకులను అధికారులు నియమించారు.

అభ్యర్థులకు సూచనలు..
1.పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు ఆలస్యం కాకుండా ఉండేందుకు ఒకోరోజు ముందు సెంటర్ అడ్రెస్ ను తెలుసుకోవాలి.
2. అభ్యర్థుల పరీక్ష షెడ్యూల్ కు కనీసం 1 గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి.
3. అభ్యర్ధులకు కేటాయించిన కేంద్రాల్లో మాత్రమే పరీక్ష రాయసేందుకు అనుమతిస్తారు
4. అభ్యర్థులు రెండు బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు, హాల్ టికెట్ తీసుకుపోవాలి.
5. మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించరు
6. హాల్ టిక్కెట్ పై ముద్రించిన సూచనలు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి.
7. ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి కోసం ఓఎంఆర్ షీట్లో అందించిన సర్కిల్ ను పూర్తిగా షేడ్ చేయాలి. లేదంటే సమాధానం చెల్లదని టెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.