Bank Loans: లోన్లకు సంబంధించి బ్యాంకులకు కేంద్ర ఆర్ధికశాఖ కీలక ఆదేశాలు

లోన్లకు సంబంధించి బ్యాంకులకు కేంద్ర ఆర్ధికశాఖ కీలక సూచనలు జారీ చేసింది. లోన్లను రైటాప్ చేసే విషయంలో మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించింది.

  • Written By:
  • Publish Date - May 1, 2023 / 11:06 PM IST

Bank Loans: లోన్లకు సంబంధించి బ్యాంకులకు కేంద్ర ఆర్ధికశాఖ కీలక సూచనలు జారీ చేసింది. లోన్లను రైటాప్ చేసే విషయంలో మరింత చురుగ్గా వ్యవహరించాలని సూచించింది. బ్యాంకు లోన్లను సాంకేతికంగా రద్దు చేసిన రుణాలను వసూలు చేయడానికి సంబంధించి మరింత చురుగ్గా పనిచేయాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రైటాప్ లోన్ల రికవరీ రేటు 14 శాతం మాత్రమే ఉందని, దీనిని 40 వాతానికి పెంచాలని బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర ఆర్ధికశాఖ కీలక ప్రకటన చేసింది.

రుణాలు వసూలు ఇప్పుడు చాలా నెమ్మదిగా సాగుతుండటంపై ఆర్ధికశాక అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిని మరింత పెంచాల్సిన అవసరముందని స్ఫష్టం చేసింది. గత ఐదేళ్లల్లో రూ.7.34 లక్షల కోట్లు సాంకేతికంగా రద్దు చేయగా.. అందులో రూ.1.03 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. దీంతో రైటాఫ్ రుణాల విలువ రూ.6.31 లక్షల కోట్లకు పరిమితమైంది. రైటాఫ్ చేసిన రుణాల విషయంలో బ్యాంకులు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నాయి.

అయితే రైటాఫ్ చేసిన రుణాలను తమ బ్యాలెన్స్ షీట్స్ ల నుంచి బ్యాంకులు తొలగిస్తాయి. రైటాఫ్ చేసిర రుణాలను వసూలు చేయాల్సి ఉంటుంది. రైటాఫ్ రుణాల వసూలు చేసే విషయంలో బ్యాంకులు వివిధ పద్దతులు పాటిస్తాయి. కోర్టుల్లో కేసులు వేయడం, ట్రైబ్యునళ్లను ఆశ్రయించడం లాంటివి చేస్తూ ఉంటాయి. కస్టమర్లపై వివిధ రూపాల్లో చర్యలు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాయి. వీటిని వసూలు చేయడం వల్ల బ్యాంకులకే లాభం జరుగుతుంది. కానీ బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆర్ధికశాఖ గుర్తించింది. దీంతో బ్యాంకులతో కీలక సమావేశం నిర్వహించింది. త్వరలోనే మరోసారి సమావేశాన్ని నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. రైటాఫ్ లోన్లను వీలైనంత త్వరగా వసూలు చేయాలని, దీని వల్ల బ్యాంకుల పురోగతి సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.