Site icon HashtagU Telugu

TCongress: రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం?

New Farmer Schemes

Farmers

TCongress: సంచలన నిర్ణయాలతో పాలన సాగిస్తోన్న రేవంత్ రెడ్డి సర్కార్.. రైతు బంధు విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో చెట్లు పుట్టలు, రోడ్లు, గుట్టలకు, పెద్ద పెద్ద భూస్వాములకు రైతుబంధు డబ్బులు ఇచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు భరోసా కోసం కఠినమైన విధివిధానాలు రూపించే పనిలో నిమగ్నమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన నిరుపేదలకే పథకాలు అందాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. రైతు బంధు పెట్టుబడి విషయంలోనూ అదే టార్గెట్ పెట్టుకుంది.

ముందు నుంచి రైతుబంధును ఐదెకరాలకు పరిమితి విధించాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం.. ఆ మేరకే విధివిధానాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. రైతు భరోసాకు 5 ఎకరాల పరిమితి విధించనున్నట్టు వార్తలు ప్రచారమవుతున్న నేపథ్యంలో.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాటికి బలం చేకూరుస్తున్నాయి. దీంతో.. కేవలం 5 ఎకరాల స్థలం ఉన్నవారికే.. అది కూడా సాగు చేసే స్థలానికి మాత్రమే ఇవ్వాలని విధివిధానాలు తయారు చేస్తున్నట్టు సమాచారం.