Drug Tests: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక నిర్ణయం, నిందితులకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు

  • Written By:
  • Updated On - March 30, 2024 / 10:31 PM IST

Drug Tests: ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు ఆరోపించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో నిందితులను గుర్తించేందుకు కొంతమందికి క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని హైకోర్టును కోరుతున్నారు. ఈ కేసులో నిందితులుగా మొత్తం 14 మందిని గుర్తించారు. వీరిలో ముగ్గురు మాత్రమే డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయింది. కొంతమంది సెలబ్రెటీస్ సమయం తీసుకుని విచారణకు రావడంతో.. వారి నమూనాల్లో డ్రగ్స్ ఆనవాలు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు.

వారి శరీరాల్లో డ్రగ్స్ గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి క్రోమోటోగ్రఫీ పరీక్ష చేయనట్లు తెలుస్తోంది.గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్‌ తీసుకున్న కొందరు యువకులను ఫిబ్రవరి 26వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. రాడిసన్ హోటల్‌లో సదరు యువకులు గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు.

వారిలో ఒక ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు, మరికొంతమంది సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు రాడిసన్ హోటల్‌పై దాడి చేశారు.