Site icon HashtagU Telugu

Kesineni Nani: టీడీపీ గొట్టం గాళ్ళ కోసం పని చేయాల్సి వస్తుంది: కేశినేని ఘాటు వ్యాఖ్యలు

Kesineni Nani

New Web Story Copy 2023 06 08t160941.797

Kesineni Nani: టీడీపీలో అంతర్గత పోరు గత ఎన్నికల నాటి నుండి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో ఇది బయటపడింది. ఓ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ముందు కేశినేని ప్రవర్తన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా నాని టీడీపీ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ రోజు గురువారం నాని మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేశినేని మాట్లాడుతూ… టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందలేదని, విజయవాడ టీడీపీ భవనం ప్రారంభోత్సవానికి కూడా నన్ను పిలవలేదని అన్నారు. టీడీపీలో నాకు ఏ పదవీ లేదు. నేను టీడీపీలో అధికార ప్రతినిధిని కాదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది గొట్టం గాళ్ళ కోసం పనిచేయాల్సి వస్తుందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నాని. ప్రజలకు మంచి చేసే వారికీ అన్ని పార్టీల నుంచి ఆఫర్స్ వస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాని. నేను అన్ని పార్టీలతో టచ్ లో ఉంటాను. బీజేపీ,వైసీపీ,కాంగ్రెస్,వామపక్షాలతో కూడా టచ్ లో ఉంటాను అన్నారు. నేను పార్టీల తరపున కార్యక్రమాలు చేయడం లేదు. . ప్రజల తరపున చేస్తున్నానని చెప్పారు. ఇదే సమయంలో నియోజకవర్గాల ఇంఛార్జీలు గొట్టం గాళ్ళు అంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆయన. వాళ్లేమీ కాంస్టిట్యూషన్ కాదు. ఇక్కడేమి రాజ్యాంగ పదవులు లేవు. విజయవాడ సెంట్రల్ లో పార్టీ ఆఫీస్ ప్రారంభానికి అచ్చెన్నాయుడు వచ్చాడు. నన్ను పిలవకుండా ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అంటూ అనుమానం వ్యక్తం చేశారు నాని.

వైసీపీ పార్టీ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. కానీ ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు 100 శాతం మండితే నిర్ణయం తీసుకుంటాను అంటూ కేశినేని షాకింగ్ కెమెంట్స్ చేశారు. వైసీపీ వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు అంటే నేను మంచివాడిని అనే కదా. ప్రజలకు మంచి చేసే నాయకులే కావాలి కదా అన్నారు నాని. ఇక తాజాగా చంద్రబాబు అమిత్ షాతో భేటీ అంశంపై నాని స్పందించారు. అమిత్ షా తో చంద్రబాబు ఏం మాట్లాడారో నాకు తెలియదు. వాళ్ళ పీఏ ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళాను అంతేనని స్పష్టం చేశారు. టీడీపీ నన్ను పొమ్మనలేక పొగబెట్టి పంపించేయాలని చూస్తుంది. నాకు హీట్ తగిలితే అప్పుడు పార్టీ మార్పు అనేది కన్ఫర్మ్ చేశారు నాని.

Read More: MLC Kavitha: కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదు: చెరువుల పండగలో కవిత