Kesineni Nani : టీడీపీని వీడడం ఫై కేశినేని నాని క్లారిటీ

లోక్ సభ ఎన్నికల్లోనూ తాను టీడీపీ పార్టీ నుండే ఎంపీగా పోటీ చేస్తానని.. ఎన్నికల్లో గెలిచి తాను మూడోసారి లోక్ సభకు వెళ్తానని స్పష్టం

Published By: HashtagU Telugu Desk
Kesineni Nani

Nani

విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని (Kesineni nani) నాని పార్టీని (TDP) వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ తాను టీడీపీ పార్టీ నుండే ఎంపీగా పోటీ చేస్తానని.. ఎన్నికల్లో గెలిచి తాను మూడోసారి లోక్ సభకు వెళ్తానని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఫై ప్రశంసలు కురిపించారు.

దేశంలో నిజాయతీగా ఉన్న కొద్దిమంది నేతల్లో మా అధినేత చంద్రబాబు ఒకరని..ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేదని నాని అన్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు (Chandrababu IT Notice) ఇవ్వడం సాధారణ విషయమని.. దానికి ఆయనే సమాధానమిస్తారన్నారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న కింది స్థాయి నాయకులు ఇప్పటికీ కూడా చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లకపోవడం దురదృష్టకరమన్నారు.వారిని రాజకీయంగా ఎదకుండా ఈ ప్రాంతం వాళ్లు వాడుకోని వదిలేశారన్నారు. రాజకీయాల్లో ప్రజాసేవ మాత్రమే ముఖ్య పదవులు అవే వస్తాయన్నారు. పొత్తుల విషయం అధిష్టానం చూసుకుంటుందని కేశినేని నాని అన్నారు.

Read Also : CBN Praja Vedika : చంద్ర‌బాబు సంస్క‌ర‌ణ‌లు-మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం

గత కొద్దీ రోజులుగా నాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో నాని పార్టీ ని వీడనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం అవుతూ వచ్చింది. చాలామంది ఇది నిజమే అనుకున్నారు. కానీ ఈరోజు ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇవ్వడం తో ఇక పుకార్లకు చెక్ పడినట్లు అయ్యింది.

  Last Updated: 08 Sep 2023, 04:42 PM IST