World Record: 81 కోర్సులు ఒక్క రోజులో పూర్తి చేసిన మహిళ.. ఎవరంటే?

ప్రస్తుత రోజుల్లో చదువుకునే విద్యార్థి, విద్యార్థినులు చదవమంటే కొద్దిసేపు పుస్తకం పట్టి వెంటనే నిద్ర వచ్చేస్తుంది అని

  • Written By:
  • Publish Date - September 6, 2022 / 05:43 PM IST

ప్రస్తుత రోజుల్లో చదువుకునే విద్యార్థి, విద్యార్థినులు చదవమంటే కొద్దిసేపు పుస్తకం పట్టి వెంటనే నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి మొబైల్ ని చూస్తూ ఉంటారు. ఇక రాను రాను అయితే ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే ఒక గంట సేపు చదివితే చాలు అనుకుంటున్నా విద్యార్థులు కూడా ఉన్నారు. కానీ భారతదేశానికి చెందిన ఒక మహిళ మాత్రం 24 గంటల పాటు కష్టపడి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 81 కోర్సులను పూర్తి చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారతదేశానికి రెహనా షాజహాన్ సోదరి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోంది.

ఆమెలా సెంట్రల్‌ యూనివర్సిటీలో చదవాలన్న ఆశయంతో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఎంకామ్‌ ఎంట్రన్స్‌ రాయగా అందులో సగం మార్కు తేడాతో అడ్మిషన్‌ కోల్పోయింది. ఇక ఏడాది సమయం వృధా చేయడం ఇష్టం లేక డిస్టెన్స్ కోర్సులు చేసి తర్వాత ఏడాది జామియాలో ఎంబీఏ సీటు సంపాదించి పూర్తి చేసింది. ఎంబీఏ పూర్తవగానే ఆన్ లైన్ కోర్సులు చేయడం మొదలుపెట్టి ఒకే రోజులో 55 ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తి చేసింది.

ఈ విషయాన్ని ఆమె పనిచేసిన సంస్థ సీఈఓతో చెప్పగా వారు వరల్డ్‌ రికార్డ్‌ కు ప్రయత్నం చేయాలని సలహా ఇచ్చారట. అప్పటికి ప్రపంచ రికార్డు 24 గంటల్లో 75 కోర్సులుగా ఉంది.దాంతో ప్రయత్నం మొదలుపెట్టిన రెహనా 24 గంటల్లో 81 కోర్సులు పూర్తి చేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.