Site icon HashtagU Telugu

Iftar In Hindu Temple : హిందూ దేవాల‌యాల్లో ఇఫ్టార్ విందు

Iftar

Iftar

కేర‌ళలోని హిందూ దేవాల‌యాల్లో ఇస్తోన్న ఇఫ్టార్ విందు మ‌త‌సామ‌రస్యానికి ప్ర‌తీక‌గా నిలుస్తోంది. ఆ రాష్ట్రంలోని ల‌క్ష్మీన‌ర‌సింహ‌మూర్తి ఆల‌యం ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన ఇప్టార్ విందుకు సుమారు 600 మంది హిందూ, ముస్లింలు హాజ‌ర‌య్యారు. స‌హ‌ప‌క్తి విందును ఆర‌గించారు. భిన్న‌త్వంలో ఏక‌త్వానికి నిద‌ర్శ‌నంగా ఆ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం.ముస్లిం వ్యతిరేక ప్రచారాలు, మత సామరస్యం దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ న్యూస్ సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. కేరళలోని మలప్పురం జిల్లా కోటక్కల్ పట్టణంలో లక్ష్మీ నరసింహ మూర్తి ఆలయం ఉంది. ఆలయ ప్రాంగణం ప్రక్కనే ఉన్న ఇంట్లో ఇఫ్తార్ విందును నిర్వహించింది. ఇందులో ముస్లింలు, హిందువులు క‌లిసి పాల్గొని ఐక‌మ‌త్యాన్ని చాటారు. దాదాపు 600 మంది భోజనం చేశారని ఆలయ అధికారి తెలిపారు.
“మా సామరస్యం మరియు శాంతికి భంగం కలిగించినందున మేము ఇఫ్తార్ విందును నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. కానీ శాంతిని పొడిగించాలని మేము కోరుకుంటున్నాము” అని మోహనన్ నాయర్ చెప్పారు. విందులో పాల్గొనడానికి సభ్యులను ఆహ్వానించడానికి ఆలయ కమిటీ సభ్యులు భౌతికంగా ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు. ఆలయంలో గతేడాది కూడా ఇదే తరహాలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

Exit mobile version