Covid 4th wave: కోవిడ్ తో కేరళలో 213 మంది మరణించారా..?

దేశంలో కోవిడ్ మళ్లీ పంజా విసురుతోంది. సోమవారం ఒక్కరోజే 2183కేసులు నమోదు కావడం..కరోనా తీవ్రతను తెలుపుతోంది.

  • Written By:
  • Publish Date - April 19, 2022 / 01:26 PM IST

దేశంలో కోవిడ్ మళ్లీ పంజా విసురుతోంది. సోమవారం ఒక్కరోజే 2183కేసులు నమోదు కావడం..కరోనా తీవ్రతను తెలుపుతోంది. అంతకుముందు ఆదివారం నమోదైన 1150కేసులు ఎక్కువని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆందోళన చెందారు. అలాంటిది సోమవారం దానికి రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో ఉన్నతాధికారుల్లో టెన్షన్ మొదలైంది. దానికి తోడుగా దేశవ్యాప్తంగా 214 మంది మరణిస్తే…ఒక్క కేరళలోనే 213 మంది మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి.

దేశం మొత్తం మీద 1154 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. క్షేత్రస్థాయిలోని పరిస్థితులను చూస్తుంటే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబైలో కేసుల నమోదు అంతకంతకూ పెరుగుతోంది. బెంగుళూరు, కేరళ, తెలంగాణలో కేసుల తీవ్రత పెరుగుతోంది. అందుకనే మళ్లీ మాస్కు ధరించక తప్పదు. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అన్నీ రాష్ట్రాలతో సమీక్ష జరుపుతోంది.

ఓవైపు చైనాలో కూడా కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. అతిపెద్ద నగరం షాంఘై నెలరోజులుగా లాక్ డౌన్ లోనే ఉంది. ఇంత కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నా…రోజుకు 25వేల కేసులు నమోదు కావడంతో ఒకింత ఆందోళన కలిగిస్తోంది. చైనాతో పోల్చితే మనదేశంలో ఆంక్షలను కఠినంగా అమలు చేసే అవకాశం లేకపోవడంతోనే మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మనదేశంలో సోషల్ డిస్టెన్స్ పాటించడం సాధ్యం కాదు..కనీసం మాస్కు ధరించమంటే కూడా చాలామంది పట్టించుకోని పరిస్థితి.

ఈనేపథ్యంలో కేసులు మళ్లీ పెరగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కేరళ అంతర్జాతీస్థాయిలో ప్రముఖ పర్యాటక రాష్ట్రం. కాబట్టి కేరళలో కేసుల తీవ్రతతోపాటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కానీ దేశం మొత్తం మీద మరణించిన 214మందిలో ఒక్కకేరళలో మాత్రమే 213మంది మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో కూడా కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుంటేనే బాగుంటుందని..లేదంటే పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం లేకపోలేదు.