Site icon HashtagU Telugu

Kerala Police: వేటకత్తితో నరకడానికి వ్యక్తిని ఎదురించిన కేరళ పోలీస్.. వైరల్ వీడియో!

Kerala Video

Kerala Video

తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. అందులో ఒక పోలీస్ పైకి ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా.. ఆ పోలీస్ మాత్రం ధైర్యంగా ఎదుర్కొని అతడిని అరెస్టు చేశారు. ఇంతకు అసలేం జరిగిందంటే.. అళప్పుళ జిల్లాలోని నురానాద్ పోలీస్ స్టేషన్ లో అరుణ్ కుమార్ అనే పోలీసు అధికారి ఎస్ఐ గా పని చేస్తున్నారు.

ఇక ఆయన తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. అక్కడ పారా జంక్షన్ ప్రాంతంలో ఆ రోడ్డు పక్కన స్కూటీ పార్కు చేసిన వ్యక్తి వద్ద తమ వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాదనలు జరగగా పోలీస్ జీపు కాస్త ముందుకు వెళ్ళి ఆగింది. వెంటనే అక్కడ స్కూటీ మీద ఉండే వ్యక్తి వేట కత్తి తీసి ఎస్ఐపై దాడికి ప్రయత్నించగా.. ఆ ఎస్సై మాత్రం ధైర్యంగా ఎదుర్కొని.. ఆ వ్యక్తి దగ్గర ఉన్న కత్తిని లాగేసుకున్నారు.

అక్కడ కొంతమంది స్థానికులు వచ్చి అతడిని కొట్టగా.. అతడిని వాహనంలో ఎక్కించుకుని స్టేషన్ కు తరలించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారడంతో నెటిజనులు ఆ ఎస్ఐ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఇక ఎస్ఐ చేతికి గాయం కాగా ఏడు కుట్లు పడినట్లు తెలుస్తుంది.

 

Exit mobile version