Site icon HashtagU Telugu

Kerala: కేరళ హై కోర్టు సంచలన తీర్పు

వ్యాక్సిన్ సర్టిఫికెట్ పై ప్రధాని నరేంద్రమోడీ ఫోటోను తొలగించాలని కేరళ హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి కి లక్ష రూపాయలు జరిమానా ఇస్తూ తీర్పు చెపింది హై కోర్టు. సదరు వ్యక్తి ప్రైవేటు ఆసుపత్రి లో డబ్బులు కట్టి వ్యాక్సిన్ వేయించుకోగా.. తన వ్యాక్సిన్ సర్టిఫికెట్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఉంది. తను సొంతంగా డబ్బులు కట్టి ప్రైవేటు ఆసుపత్రిలో వేయించుకున్న సర్టిఫికెట్ పై ప్రధాని ఫోటోను వెంటనే తొలగించాలని హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ లో భాగంగా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పెటిషనర్ రాజకీయ లబ్ది కోసమే పిటిషన్ దాఖలు చేశారని కేసును కొట్టివేసింది. అంతే కాకుండా లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.