Nipah Virus: కేరళను వణికిస్తున్న నిపా వైరస్‌..లక్షణాలు – జాగ్రత్తలు

కేరళ రాష్ట్రంలో నిపా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరో వ్యక్తి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దీంతో కేరళలోని కోజికోడ్‌ జిల్లాలో అలర్ట్‌ ప్రకటించారు

Nipah Virus: కేరళ రాష్ట్రంలో నిపా వైరస్‌ విజృంభిస్తోంది. దీంతో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరో వ్యక్తి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. దీంతో కేరళలోని కోజికోడ్‌ జిల్లాలో అలర్ట్‌ ప్రకటించారు. ఈ సందర్భంలో నిపా వైరస్ ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాలు ఏమిటి మరియు దాని చికిత్స ఏమిటి అనేది చూద్దాం.

నిపా వైరస్ (NiV) అనేది జూనోటిక్ వైరస్, అంటే ఇది జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తుంది. ఇది మొట్టమొదట 1998లో మలేషియా మరియు సింగపూర్‌లో పురుడుపోసుకుంది. తర్వాత పందులకు సోకింది. తదనంతరం కుక్కలు, పిల్లులు మరియు మేకలతో సహా పెంపుడు జంతువులలో వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. తదనంతరం 1998లో మలేషియాలో మనుషుల్లో వైరస్‌ను గుర్తించారు. కాబట్టి నిపా వైరస్ మనుషులకు మరియు జంతువులకు ప్రమాదకరమని తెలుస్తోంది. నిపా వైరస్ సోకిన గబ్బిలాల ద్వారా మనుషులకు లేదా ఇతర జంతువులకు వ్యాపిస్తుంది. అలాగే వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వైరస్ లక్షణాలు:
నిపా వైరస్ లక్షణాలు సాధారణంగా 4-14 రోజుల్లో కనిపిస్తాయి. శ్వాసకోశ సమస్యలు, జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, మూర్ఛ వంటి లక్షణాలు ఉంటాయి. వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే మూర్ఛలు కూడా వస్తాయని చెబుతున్నారు. నిపా రోగుల మరణాల రేటు 40 శాతం నుండి 75 శాతం వరకు ఉంటుంది.

ముందు జాగ్రత్త చర్యలు:
నిపా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. నిపా వైరస్ సోకిన రోగులకు ప్రత్యేక గదిలో చికిత్స అందించాలి. ఈ వైరస్‌ను నిరోధించడానికి వ్యాక్సిన్ లేనందున వైరస్ సోకిన వ్యక్తుల నుండి మనల్ని మనమే రక్షించుకోవాలి సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం మరియు ఫేస్ షీల్డ్ ధరించడం చాలా ముఖ్యం.

Also Read: JR NTR: నో పాలిటిక్స్, ఓన్లీ సినిమా!