Site icon HashtagU Telugu

Kerala Ex CM : ఆసుప‌త్రిలో చేరిన కేర‌ళ మాజీ సీఎం ఊమెన్ చాందీ

Oomen Chandy

Oomen Chandy

కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ న్యుమోనియా, జ్వరం కారణంగా ఆస్పత్రి పాలయ్యారు. సోమవారం సాయంత్రం తిరువనంతపురంలోని నూరుల్ ఇస్లాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (నిమ్స్)లో ఆసుపత్రిలో చేరారు. స్వల్ప న్యుమోనియాతో బాధపడుతున్నారని, తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరారని కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఫోన్‌ చేసి తన తండ్రి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని ఆయ‌న‌కు కుమారుడు తెలిపారు. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాజీ సీఎం ఊమెన్ చాందీ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.