Site icon HashtagU Telugu

Kerala POCSO: కేరళలో బాలికపై అత్యాచారం కేసులో కీలక తీర్పు

Kerala Pocso

Kerala Pocso

Kerala POCSO: కేరళలో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో బీహార్‌కు చెందిన యువకుడిని ఎర్నాకం పోక్సో కోర్టు శనివారం దోషిగా నిర్ధారించింది. జులై 28న కేరళలోని అలువా ప్రాంతంలో నివసించే బీహార్‌కు చెందిన అస్పాక్ ఆలం అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటన కేరళలో తీవ్ర కలకలం సృష్టించడంతో.. సీసీటీవీ సాయంతో పోలీసులు ఆలమ్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై సంబంధిత కేసులు నమోదు చేశారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి ఎర్నాకుళం కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేయగా, వరుసగా 100వ రోజు విచారణ పూర్తయింది. అయితే తాజాగా ఎర్నాకుళం పోక్సో కోర్టు ఆలంపై చేసిన నేరాలన్నీ రుజువైనట్లు నిర్ధారించి తీర్పునిచ్చింది. కాగా ఈ కేసులో నిందితుడికి శిక్షను నవంబర్ 9న ఖరారు చేయనున్నారు.కోర్టు తీర్పుపై విచారణకు నేతృత్వం వహించిన ఎర్నాకుళం రూరల్ పోలీస్ చీఫ్ వివేక్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. వివేక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో చార్జిషీట్ 30 రోజుల్లో దాఖలు చేసినట్లు చెప్పారు.ఘటన జరిగిన 100 రోజుల తర్వాత నిందితుడిని దోషిగా తేల్చిన క్రమంలో మేము భాగమైనందుకు గర్వంగా ఉందని చెప్పారు.

Also Read: AI Resume : రెజ్యూమె తయారీకి 6 జబర్దస్త్ ఏఐ టూల్స్