Kerala: పాఠశాల పాఠ్యపుస్తకాల్లో గాంధీ, నెహ్రు సమాచారం తొలగింపు

కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర దినోత్సవానికి ముందు కేరళ పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మహాత్మాగాంధీ, నెహ్రూలకు సంబంధించిన విషయాలను తొలగించింది.

Kerala: కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర దినోత్సవానికి ముందు కేరళ పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మహాత్మాగాంధీ, నెహ్రూలకు సంబంధించిన విషయాలను తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి సమాచారం అందించారు.

కొత్తగా తరగతులు ప్రారంభానికి ముందు పాఠశాలల్లో కొత్త పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. ఈ మేరకు ఆ రాష్ట్ర పాఠ్యపుస్తకాల్లో గాంధీ, నెహ్రు అంశాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి మాట్లాడుతూ.. విద్యార్థులు మన చరిత్ర, ఆర్థిక శాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రాన్ని సరైన దృక్కోణంలో నేర్చుకోవడం చాలా అవసరమని చెప్పారు.ఇదిలా ఉండగా గతంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం విద్యార్థులకు భారతదేశ, దాని నిజమైన స్ఫూర్తితో బోధిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే . విశేషం ఏంటంటే కొత్తగా ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో గుజరాత్ అల్లర్లకు సంబందించిన సమాచారం చరిత్ర పాఠ్య పుస్తకంలో చేర్చినట్టు తెలుస్తుంది.

Read More: Baahubali : ‘కట్టప్ప’ సత్యరాజ్ తల్లి కన్నుమూత..