Site icon HashtagU Telugu

Delhi CM: ఈడీకి షాక్ ఇచ్చిన కేజ్రీవాల్, విచారణకు డుమ్మా

Arvind Kejriwal

Arvind Kejriwal (2)

Delhi CM: మద్యం విధానంలో అవకతవకల కేసు లో తనకు జారీ చేసిన సమన్లు వెనక్కి తీసుకోవాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈడీకి లేఖ రాశారు. కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు గైర్హాజరయ్యారు. ఎన్నికల ప్రచారం కోసం మధ్యప్రదేశ్‌కు వెళ్లనున్నారు. ఇది చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని పేర్కొంటూ, విచారణ సంస్థ తన నోటీసును ఉపసంహరించుకోవాలని కోరుతూ కేజ్రీవాల్ ఈరోజు ఈడీకి లేఖ రాశారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ విచారణ ఎదుర్కొన్నారు. సీఎంగా కేజ్రీవాల్ పాత్ర, 100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీశ్ సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్ తో సంబంధాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

ఇప్పటికే ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు పంపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకున్నారన్న ఆరోపణలతో ఆయనను ఈడీ విచారించాలనుకుంది. కానీ ఢిలీ సీఎం అనూహ్య నిర్ణయం తీసుకొని విచారణకు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది.