Patna Opposition Meet: పాట్నా చేరుకున్న కేజ్రీవాల్…

ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని దించేసి క్రమంలో విపక్షాలు ఏకతాటిపైకి వస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Patna Opposition Meet

New Web Story Copy 2023 06 22t210141.063

Patna Opposition Meet: ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని దించేందుకు విపక్షాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు. ఇక రేపు జూన్ 23న పాట్నాలో విపక్షాలు సమావేశం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాట్నా చేరుకున్నారు.

శుక్రవారం జరగనున్న ప్రతిపక్షాల కీలక సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, పార్లమెంట్ సభ్యుడు రాఘవ్ చద్దా గురువారం సాయంత్రం పాట్నా చేరుకున్నారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా సమావేశానికి హాజరయ్యేందుకు పాట్నా చేరుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత బెనర్జీ మధ్యాహ్నం పాట్నా చేరుకుని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ను కలిశారు.

Read More: Milk in Dream: కలలో పాలు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

  Last Updated: 22 Jun 2023, 09:03 PM IST