SunBurn: ఎండాకాలం సీజన్ మొదలైంది. ఎండ తీవ్రత బాగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు తీవ్రతరం కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ ప్రభావంతో పాటు ఉక్కబోతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ ప్రభావానికి వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంటుంది. దీంతో బయటకు వెళ్లేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వడదెబ్బ తగలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటో చూద్దాం.
ఎండ వల్ల ఎక్కువగా అలసటగా ఉంటుంది. కండరాల నొప్పి ఉండటంతో పాటు కిడ్నీ, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. హీట్ స్ట్రోక్ వల్ల మెదడు పనితీరు కూడా దెబ్బతిని వడదెబ్బ వల్ల కోమాలోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఎండాకాలం వడదెబ్బకు గురై ఇబ్బంది పడవచ్చు. దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు.
వడదెబ్బ తగిలినప్పుడు అలసట, ఒళ్లు నొప్పులు, విపరీతమైన చెమట, కళ్లు తిరగడం, వాంతులు, అధిక దాహం, తక్కువ మూత్ర విసర్జన, వికారం, మూర్భ, స్పృహ కోల్పోవడం వంటి లక్షాణాలు ఉంటాయి. వడదెబ్బకు తగలకుండా ఉండాలంటే.. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకపోవడం మంచిది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం చాలా మంచిది. ఇక ముదురు రంగు దుస్తులు కాకుండా తేలికపాటి లేత రంగు దుస్తులు కూడా ధరించాలి.
కోబ్బరి నీళ్లు, నిమ్మరసం, పుచ్చకాయలు, దానిమ్మ లాంటి పండ్లు తీసుకోవాలి. వడదెబ్బకు గురి కానప్పుడు మెడ, ముఖ్యంపై ఐస్ ప్యాక్ పెట్టుకోవడంతో పాటు చల్లని వాతావరణంలో ఉండాలి. పండ్ల రసాలు వంటివి తీసుకోవాలి. ఒంటిపై దుస్తులను వదులుగా చేసి గాలి ఆడేలా చేయాలి. ఆ తర్వాత వెంటనే హాస్పిటల్ కు వెళ్లాలి.