Site icon HashtagU Telugu

Jyotirao Phule: మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో కేసిఆర్ పాలన : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Jyotirao Phule

Jyotirao Phule

Jyotirao Phule: మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతి సందర్భంగా మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ దేశానికి ఫూలే చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు.జ్యోతిబా ఫూలే అందించిన స్ఫూర్తితో కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని తెలిపారు.
కేసిఆర్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం పాటుపడుతున్నదని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నేడు తెలంగాణలోని దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలు, మహిళలు.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నమన్నారు.అణగారిన వర్గాలు, బహుజనుల సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పూలే ఆశయ స్ఫూర్తిని కొనసాగిస్తామని మంత్రి వేముల స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి రాజేశ్వర్ రావు,మంత్రి కార్యాలయ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.