Site icon HashtagU Telugu

Telangana Liquor : మద్యం విషయంలో కేసీఆర్‌ పాలసీనే గ్రేట్‌..

telangana liquor

telangana liquor

కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) ఇంత బాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందన్న..ప్రజలకు అనేక సంక్షేమ పధకాలు అందజేస్తుందన్న..ఆసరా పెన్షన్లు దేశంలో ఎక్కడలేని విధంగా ఇస్తుందన్న ..రైతులకు పలు భీమాలు కల్పిస్తుందన్న ..ఇవే కాక ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటున్న అదంతా కూడా మద్యం అమ్మకాల (Telangana Liquor Sales) ద్వారా వచ్చే డబ్బుతోనే. ఇది ఎవర్ని అడిగిన చెప్పే మాటే. మద్యం ఫై ఆంక్షలు పెట్టి ..ప్రభుత్వ ఖజానను దెబ్బ తీసుకునే బదులు మద్యం ఫై ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా విచ్చలవిడిగా అమ్మకాలు జరిపి ప్రభుత్వ ఖజానా నింపుకోవడం బెటర్ అని కేసీఆర్ (CM KCR) అనుకున్నారు..అదే చేస్తున్నారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులు ఉన్నారు. ప్రతి రోజు ప్రభుత్వానికి కోట్లాది కోట్ల రూపాయిలు మద్యం అమ్మకాల ద్వారానే వస్తున్నాయి. పండగల సమయాల్లో, న్యూ ఇయర్ వేడుకల్లో ఇక చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎన్నికల సమయాన అయితే మద్యం ఏరులా ప్రవహిస్తుంది. ఒకప్పుడు మద్యం తాగేవారు 5 శాతం ఉండేవారు. ఈ 5 శాతం మందికూడా గుట్టుచప్పుడు కాకుండా మందు తాగేవారు. తాగనివారంతా శీతల పానీయాలు తాగుతూ ఎంజాయ్‌ చేస్తుంటే.. మద్యం తాగేవారు దొంగతనంగా చాటుమాటుగా తాగేవారు. కానీ నేడు మద్యం తాగేవారు బహిరంగంగా తాగుతున్నారు. తాగనివారు ఒక గదిలో మూలన కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ప్రస్తుతం మద్యం అమ్మకాల టెండర్‌ (Telangana Liquor Tender)నడుస్తుంది. రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయంటే అర్ధం చేసుకోవచ్చు మద్యం అమ్మకాల ద్వారా ఎంత లాభాలు వస్తున్నాయో. కేవలం ఈ దరఖాస్తుల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 2 వేల కోట్ల రూపాయలు వచ్చాయంటే..ఇంతకన్నా ఏమికావాలి. అలాగే దరఖాస్తు దారుల్లో 25 శాతం మంది మహిళలే ఉండడం గమర్హం. ఒకప్పుడు మద్యం తాగేవారిని అసహ్యించుకునే మహిళలు ఇప్పుడు మద్యం అమ్మడానికి ముందుకు వస్తుండడం తెలంగాణలోనే చెల్లింది. పట్టణం , నగరం , పల్లె అనే తేడాలు లేకుండా అన్ని చోట్ల వైన్ షాప్స్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం.. ఉదయం 09 నుండి రాత్రి 11 గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్ చేసేలా నిర్ణయం తీసుకోవడం..మద్యం ధరలు కూడా తక్కువకే అందజేస్తుండడం తో రాష్ట్రంలో మందుబాబులు ఎక్కువయ్యారు.

ఈరోజు సోమవారం తెలంగాణ వ్యాప్తంగా (Telangana State) మద్యం దుకాణాల లక్కీ డ్రా (Lucky draw) ప్రక్రియ నడుస్తుంది. జిల్లా కలెక్టర్ల ఆధీనంలో లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో లక్కీ డ్రా సెంటర్లలో మద్యం వ్యాపారులు పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా కొనసాగుతోంది. ఈ 2650 మద్యం షాప్స్ కు లక్షా 31 వేల 970 దరఖాస్తులు చేసుకున్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి, సరూర్‌నగర్‌, శంషాబాద్‌ ఎక్సైజ్‌ జిల్లాల్లోనే 42,596 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ గతంలో 18,091 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. ఇందులో అత్యధికంగా సరూర్‌నగర్‌లో 134 మద్యం దుకాణాలకుగాను 10,908 దరఖాస్తులు, శంషాబాద్‌లో 100 షాపులకు 10,811 అప్లికేషన్లు వచ్చాయి. ఇక నల్లగొండలో 155 దుకాణాలకు 7,058, ఖమ్మంలో 122 షాపులకు 7,027, మేడ్చల్‌లో 114 దుకాణాలకు 7,017, మల్కాజిగిరి, కొత్తగూడెంలో 88 చొప్పున దుకాణాలు ఉండగా 6,722 దరఖాస్తులు, 5,057 అప్లికేషన్లు రావడం జరిగింది. మరి వీరిలో ఆ లక్కీ విజేతలు ఎవరు చూడాలి.

Read Also : BRS : హరీష్ రావు దుకాణం బంద్ చేయించే వరకు నేను నిద్రపోను – మైనంపల్లి హనుమంతరావు