Site icon HashtagU Telugu

Pensions: కాంగ్రెస్ కు చెక్, ఆసరా పెన్షన్ల పెంపుపై కేసీఆర్ యోచన

Biometric Pension

Biometric Pension

Pensions: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే పలు పథకాలతో ఆకట్టుకుంటున్న ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించబోతోంది. ఆసరా పెన్షన్ల పెంపుపై త్వరలో సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారని అన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి కేవలం హామీతోనే సరిపెట్టింది. అధికార బీఆర్ఎస్ పెన్షన్లు పెంచి చూపించబోతోంది.

అదే జరిగితే.. కాంగ్రెస్ 4వేల రూపాయల పెన్షన్ హామీని ప్రజలు పట్టించుకునే అవకాశం ఉండదు. తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్న కేటీఆర్ ఆసరా పెన్షన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. త్వరలో అవ్వాతాతలకు శుభవార్త చెబుతామన్నారు. 1956 నుంచి కాంగ్రెస్‌, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని ఆయన కోరారు.