Site icon HashtagU Telugu

YS Sharmila : కేసీఆర్..నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ – షర్మిల మాస్ వార్నింగ్

KCR's countdown has begun”- YS Sharmila

KCR's countdown has begun”- YS Sharmila

YSRTP అధినేత్రి వైస్ షర్మిల (YS Sharmila) మరోసారి తెలంగాణ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు మాస్ వార్నింగ్ ఇచ్చింది. కేసీఆర్..నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ (KCR’s countdown has begun) అంటూ హెచ్చరించింది. ప్రస్తుతం షర్మిల తన పార్టీ ని కాంగ్రెస్ పార్టీ లో విలీనం (ysrtp merger with congress) చేసేందుకు సిద్ధంగా ఉందనే ప్రచారం గత కొద్దీ రోజులుగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పెద్దలను కలవడం జరిగింది. షర్మిల పార్టీ విలీననానికి కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పినప్పటికీ , కాకపోతే కొన్ని కండిషన్లు మాత్రం షర్మిల ముందు ఉంచారు. తెలంగాణ లో కాకుండా ఏపీ ఫై ఆమెను ఫోకస్ చేయాలనీ..ఏపీలో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తీసుకురావాలనే బాధ్యత ఆమెకు అప్పజెప్పారు.

కాకపోతే షర్మిల తెలంగాణ రాజకీయాల వైపే మొగ్గు చూపిస్తూ వస్తుంది. అయితే తాజాగా మాత్రం ఆమె విలీన అంశం ఫై ఓ ఫైనల్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అందుకే కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చించేందుకు బుధవారం షర్మిల తన భర్త అనిల్ కుమార్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు. సొంత పార్టీ నేతలకు గానీ.. భద్రతా సిబ్బందికి కానీ చెప్పకుండా వారిద్దరూ ఢిల్లీ వెళ్లారట.

అక్కడ వరుసగా కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయినా షర్మిల..ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ తో భేటీ (Sharmila Meets Sonia Gandhi) అయ్యారు. దాదాపు వీరిద్దరూ గంటసేపుకు పైగా సమావేశమయ్యారు. సోనియా గాంధీతో షర్మిల భేటీ అనంతరం తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు షర్మిల ప్రకటన విడుదల చేస్తారని అంత అనుకున్నారు కానీ..ఆమె మాత్రం అలాంటి ప్రకటన ఏదీ చేయకుండానే వెనుదిరిగారు. సోనియాతో బ్రేక్ ఫాస్ట్ భేటీ అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరాయంగా పని చేస్తోందని తెలిపింది. సీఎం కేసీఆర్ కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందని మాస్ వార్నింగ్ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీలో YSRTP విలీనంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.

Read Also : Raksha Bandhan : తమ్ముడంటే ఎంత ప్రేమ..రాఖీ కట్టేందుకు కాలినడకన 8 కిమీ నడిచిన 80 ఏళ్ల వృద్ధురాలు

రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి కూతురిగా మార్క్ చూపించాలని ఎన్నో కలలు కన్నా షర్మిల ‘కల’ కలగానే మిగిలింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తా..రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తా..కేసీఆర్ ని గద్దె దించుతా..దొరల పాలనా అంతం చేస్తా అంటూ భారీ సవాళ్లు చేస్తూ తెలంగాణ లో YSRTP (YSR తెలంగాణ పార్టీ ) స్థాపించిన వైస్ షర్మిల (YS Sharmila)..ఎంతో కాలం గడవకముందే కనీసం ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో తన పార్టీ ని కలిపేందుకు సిద్ధమైంది. పార్టీ స్థాపించిన వెంటనే షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టింది.

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రతి మంగళవారం దీక్షలు చేపట్టింది..కేసీఆర్ (KCR) కు వ్యతిరేకంగా గట్టిగానే ఒంటరిగా ట్రై చేసింది. కానీ ఇవేమి కూడా పార్టీ కి బలం తీసుకరాలేకపోయాయి. ఏ ఒక్క నేత కూడా షర్మిల పార్టీ లో చేరలేదు. ఎటు వెళ్లిన పది మందిని వెంటేసుకొని వెళ్ళింది తప్ప..రాజకీయ నేతలు ఎక్కడ..ఎవ్వరు కనిపించలేదు. ఇక రాష్ట్రంలో బహు పార్టీల నేపథ్యంలో షర్మిళ పార్టీకి అనుకున్నంత స్థాయిలో హైప్ రాలేదు. ఇవన్నీ చూస్తూ వచ్చిన షర్మిల..ఇక పార్టీ ని నడపడం కంటే కాంగ్రెస్ పార్టీ లో కలపడమే బెటర్ అని డిసైడ్ అయ్యింది. అతి త్వరలోనే YSRTP ని కాంగ్రెస్ లో కలుపుతున్నట్లు స్వయంగా ప్రకటించనుంది.

Exit mobile version