Site icon HashtagU Telugu

Revanth Reddy: కేసీఆర్ జన్మదినం.. నిరుద్యోగుల ఖర్మ దినం!

Telangana to k Congress

Kcr And Revanth

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన నిరుద్యోగులకు మద్దతుగా కేసీఆర్ దిష్ఠిబొమ్మలు తగలబెట్టండి అంటూ పిలుపునిచ్చారు. కేసీఆర్ జన్మదినం… ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా? అని ఆయన ప్రశ్నించారు. జన్మదినం సందర్భంగా ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించి… కేటీఆర్ తన తండ్రికి నజరానా ఇవ్వదలచుకున్నారా? అంటూ మండిపడ్డారు. నిరుద్యోగుల ఆవేదనకు సమాధానం చెప్పకుండా ఉత్సవాలు ఏమిటని ప్రశ్నించడమే మేం చేసిన పాపమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ జన్మదినం… నిరుద్యోగుల ఖర్మ దినంగా మారిందని ఆయన తనదైన స్టైయిల్ లో సెటైర్స్ వేశారు. నిరుద్యోగులకు మద్ధతుగా, మెగా నోటిఫికేషన్ డిమాండ్ తో అన్నీ మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేయాలంటూ పార్టీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.