Site icon HashtagU Telugu

Kavitha: అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారు: కల్వకుంట్ల కవిత

Mlc Kavitha

Mlc Kavitha

Kavitha: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు స్వల్ప గాయమైన విషయం తెలిసిందే. కేసీఆర్‌ను పరిశీలించిన వైద్యులు కేసీఆర్‌ తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దాంతో.. కేసీఆర్‌ను ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ ఆరోగ్యం, చికిత్స గురించి ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.

ఈ మేరకు ఎక్స్‌ (ట్విట్టర్‌)లో ఒక పోస్టు పెట్టారు. ప్రస్తుతం కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఆయనకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని కవిత ఎక్స్ వేదికగా వెల్లడించారు. కేసీఆర్‌కు స్వల్ప గాయం అయ్యిందనీ.. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. అందరి ప్రార్థనలతో కేసీఆర్ త్వరలోనే కోలుకుంటారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.