Site icon HashtagU Telugu

KCR: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర తండ్రి మరణం పట్ల కేసీఆర్ సంతాపం

Kcr (6)

KCR: దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ నాయక్ తండ్రి రమావత్ కనీలాల్ నాయక్ మరణం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఇంటిపెద్దను కోల్పోయి శోక తప్త హృదయులైన రవీంద్ర కుమార్ నాయక్ కు వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగత కనీలాల్ నాయక్, ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించి పదవీ విరమణ పొందారు.

అనంతర కాలంలో దేవరకొండ మండలం లోని తమ స్వగ్రామం రత్యానాయక్ తండా సర్పంచి గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడి ప్రజలకు సేవలందించారు. ఆదివారం నాడు రత్యానాయక్ తండాలో వారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారు రత్యానాయక్ తండాకు వెళ్లి దివంగత కనీలాల్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.