Site icon HashtagU Telugu

KCR Visit: జార్ఖండ్‌ కు సీఎం కేసీఆర్!

Kcr55

Kcr55

చైనా సరిహద్దులోని గాల్వానా లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ అమరవీరులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఢిల్లీ నుంచి రాంచీకి వెళ్లి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో కలిసి జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు వారి అధికారిక నివాసంలో రూ.10 లక్షల చెక్కులను అందజేయనున్నారు.

చైనాతో వివాదంలో మన రాష్ట్రానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం నేపథ్యంలో వారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకున్న సంగతి తెలిసిందే. ఇదే సందర్భంగా 19 మంది అమరులైన జవాన్ల కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు సీఎం కేసీఆర్ శుక్రవారం జార్ఖండ్‌కు వెళ్లనున్నారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రకటించిన మేరకు మిగిలిన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటారు.