Site icon HashtagU Telugu

KCR: రేపే అసెంబ్లీలో సంచలన ప్రకటన – ‘కేసీఆర్’

Kcr

Kcr

రేపు(బుధవారం) తెలంగాణ శాసనసభ(Assembly) వేదికగా కీలక ప్రకటన చేయనున్నట్టు వెల్లడించారు తెలంగాణ సీఎం కేసీఆర్. మంగళవారం వనపర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేసీఆర్.. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నాను అని తెలిపారు ఆయన. నిరుద్యోగుల కోసం కీలక ప్రకటన రేపు చేస్తాను.. అందరూ గమనించాలి.. రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులంతా టీవీలు చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.

అసెంబ్లీలో మార్చి 9న బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు నిరుద్యోగ యువ సోద‌రుల కోసం అనౌన్స్ చేయ‌బోతున్నట్టు వెల్లడించారు కేసీఆర్. నిరుద్యోగ సోద‌రులంతా బుధవారం ఉదయం 10 గంట‌ల‌కు టీవీలు చూడండి. ఏం ప్రక‌ట‌న చేయ‌బోతున్నామో చూడాలన్నారు.. దీంతో.. రేపు కేసీఆర్‌ ఏ ప్రకటన చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది… మరీ ముఖ్యంగా నిరుద్యోగులు 10 గంటలకు టీవీలు చూడాలని కేసీఆర్‌ ప్రకటించారంటే… భారీ స్థాయిలో ఉద్యోగ ఖాళీల భర్తీ ఉంటుందా..? నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని వారికి శుభవార్త చెబుతూ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.