Hyderabad: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో

హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్ కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

  • Written By:
  • Updated On - November 28, 2022 / 01:14 PM IST

హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్ కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో విస్తరణ చేయనున్నారు. డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 31 కిలో మీటర్లు మేర దీనిని నిర్మించున్నారు. దీనిని దాదాపు రూ.6,250 కోట్లతో నిర్మించున్నారు. ఈ విషయాన్ని ఎంఏ అండ్ యూడీ మంత్రి కెటి రామారావు ట్విట్టర్‌లో ప్రకటించారు.

“ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని ప్రకటించడానికి ఆనందంగా ఉంది. డిసెంబర్ 9న మైండ్‌స్పేస్ జంక్షన్ నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్ట్ 31 కి.మీ పొడవు ఉంటుంది. సుమారు రూ. 6,250 కోట్లు ఖర్చు అవుతుంది” అని ట్వీట్ లో చెప్పారు.

అంచనా వేసిన హై-స్పీడ్ హైదరాబాద్ మెట్రో రైలు మార్గము ఎలివేటెడ్, భూగర్భ భాగాలను కలిగి ఉంది. మొత్తం పొడవులో దాదాపు 2.5 కి.మీ ప్రాజెక్టును హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ (హెచ్‌ఏఎంఎల్) పర్యవేక్షిస్తుంది. మెట్రో కేవలం 20 నిమిషాల్లో విమానాశ్రయాన్ని ప్రధాన నగరానికి అనుసంధానం చేస్తుందని అంచనా వేస్తున్నారు. బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్‌ గూడ, నార్సింగి, TS పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్, శంషాబాద్, ఎయిర్‌పోర్ట్ కార్గో స్టేషన్, టెర్మినల్ వంటి కొన్ని స్టేషన్‌లు షెడ్యూల్ చేశారు.