Site icon HashtagU Telugu

Gutta: మేడిగడ్డ ఘటన విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదు- గుత్తా

Gutta Sukender Reddy Imresizer

Gutta Sukender Reddy Imresizer

Gutta: నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయింది.. రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్  నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానంలో నిలిచింది. దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. మళ్ళీకేసీఆర్  రావాలి. మూడో సారి ముఖ్యమంత్రి కావాలి.ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు కేసీఆర్ నే నమ్ముతారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు గెలిస్తాం. ప్రస్తుత పరిస్థితులల్లో నాపైన కూడా కొన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.అవి ఏవి నమ్మొద్దు.నీను ఏ పార్టీలో వున్నా ఆ ఆపార్టీ విజయం కోసమే పని చేస్తాను.కొన్ని కారణాల వల్ల కొంత మంది ఎమ్మెల్యేలు నాతో విడిపోవచ్చు.అయిన వారి విజయాన్నే నిను కోరుకుంటున్నా’’ అని ఆయన అన్నారు.

‘‘ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో నాకు అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, మిత్రులు వున్నారు.వారందరికీ విజ్ఞప్తి మళ్ళీ బి ఆర్ యస్ పార్టీనే గెలిపించండి. ఇప్పుడు నాకు పార్టీలు మారాల్సిన అవసరం లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నేను కానీ, నా కుమారుడు కానీ పోటీ చేస్తాము. అంతే కానీ పార్టీ మారం. కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష. తెలంగాణ బాగుండాలంటే కేసీఆర్ ఘన విజయం సాధించాలి.కాళేశ్వరం మెడిగడ్డ ప్రాజెక్టు ఘటన విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదు.సాంకేతిక సమస్యలు అప్పుడప్పుడు వస్తాయి’’ అని గుత్తా అన్నారు.