KCR: క్రిస్మస్ పండుగ పూట విషాదం నెలకొంది. రెడు వేర్వురు ఘటనల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. నల్లగొండ జిల్లాలో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరారు.
వేర్వరు ఘటనల్లో రమావత్ సేవలు (శివ నాయక్ (20), బలుగూరి సైదులు (55), మూడువ బుజ్జి(40), రమావత్ పాండు (45), రమావత్ గణ్య (48),మూడవ నాగరాజు (28) మృత్యువాత పడ్డారు. మృతులు నీమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవాని కుంట తండాకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వరుస ఘటనలతో నల్లగొండ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.