Site icon HashtagU Telugu

Bihar: తెలంగాణ సీఎం సంచలన వ్యాఖ్యలు…దర్యాప్తు సంస్థలు రాష్ట్రాల్లోకి చొరబడటం సరికాదు..!!

Cm Kcr Job Notification

Cm Kcr Job Notification

బీహార్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచనల వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీరును దుయ్యబడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గల్వాన్ లోయలో చైనాతో జరిగిన పోరులు అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడానికి బీహార్ వెళ్లారు కేసీఆర్. అక్కడ అధికార కూటమి జేడీయూ, ఆర్జేడీ నేతలత సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు జాతీయ రాజకీయాలపై కీలక చర్చలు జరిపారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుగా పెట్టుకుని మోదీ సర్కార్…ఆయా రాష్ట్రాలపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమన్నారు. సీబీఐ ప్రవేశాన్ని నిరాకరిస్తూ బీహార్ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు కేసీఆర్ . మిగతా రాష్ట్రాలన్నీ కూడా బీహార్ నే ఫాలోకావాలని పిలుపునిచ్చారు.