స్వాతంత్య్ర దినోత్సవానికి ఓ రోజు ముందే తెలంగాణ రైతుల్లో ఆనందం నింపారు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)..కేసీఆర్ సారు..రుణమాఫీ ఎప్పుడెప్పుడు చేస్తాడా అని ఎదురుచూస్తున్న రైతుల ముఖంలో వెలుగు నింపారు. రైతుల రుణమాఫీ (farmers’ loan waiver scheme) చేస్తానని చెప్పినట్లే కేసీఆర్..ఈరోజు సోమవారం రూ.లక్షలోపు ఉన్న వారి రుణమాఫీ చేసారు. సోమవారం ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఆ నగదును ఆర్థికశాఖ వేసింది. ఈ రుణమాఫీతో కలిపి ఇప్పటిదాకా 16.66 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేసింది.
ఆగస్టు 2న జరిగిన మంత్రి మండలి సమావేశంలో రుణమాఫీపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తెల్లారే ఆగస్టు 3 నుంచి రైతు రుణమాఫీ (Crop Loans)ని ప్రారంభించాలని హరీశ్ రావు, అధికారులను ఆదేశించారు. ఈ రోజు రూ.99,999 వరకు బ్యాంకులకు రైతుల తరఫున బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకి ఆదేశాలు జారీ చేయడం..ఆ నగదు మొత్తం ఆయా బ్యాంకుల్లో వేయడం జరిగింది. వాస్తవానికి 2018 లో అధికారంలోకి రాగానే లక్ష లోపు ఉన్న వారికీ రుణమాఫీ చేయాలనీ భావించారు. ఆ మేరకు కసరత్తులు చేసారు. కానీ అదే సమయంలో కరోనా రావడం..లాక్ డౌన్ పెట్టడం, కేంద్రం పెద్ద నోట్ల రద్దు ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ ఫై తీవ్ర ప్రభావం చూపాయి. అందుకే రుణమాఫీ చేయడం వీలు కాలేదు. ఇప్పుడు దశలవారికి కేసీఆర్ సర్కార్ రుణమాఫీ చేస్తూ వస్తుంది.