Site icon HashtagU Telugu

కేసీఆర్ వ్యూహాలు ..ప్రతిపక్షాలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి..

Eelection in April

Cm Kcr Decisions

రాజకీయాల్లో రాణించాలంటే ఎప్పుడు..ఎక్కడ ఎలా ఉండాలి..ఎవర్ని ఎక్కడ తొక్కాలి..ఎక్కడ అక్కున చేర్చుకోవాలి అనేది బాగా తెలియాలి. అలాగే ఎప్పటికప్పుడు వ్యూహాలు , ప్రతి వ్యూహాలు రచిస్తూ ప్రజలకు దగ్గరవ్వాలి. ప్రజలకు ఎలాంటి సమయంలో ఏ అవసరాలు తీర్చాలో..ఎన్నికల సమయంలో ఎలాంటి హామీలు ఇవ్వాలో కూడా తెలియాలి. ఆలా చేసినప్పుడే ప్రజల్లో పార్టీ ఫై నమ్మకం పెరుగుతుంది..మరోసారి గెలిపించాలనే తపన ఉంటుంది. ప్రస్తుతం బిఆర్ఎస్ (BRS) అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ అలాగే చేస్తూ..ప్రతిపక్షాలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడు. ప్రతి పక్షాలు కాస్త పుంజుకుంటున్నాయి..అనే టైములో ప్రజలకు వరాలు అందిస్తూ వస్తున్నాడు.

ప్రత్యేక తెలంగాణ కోసం చావునోట్లో తలకాయిపెట్టి తెలంగాణను తీసుకొచ్చాడు కేసీఆర్ (KCR). తీసుకొచ్చిన తెలంగాణ ను ఈరోజు దేశానికే తలమానికంగా అభివృద్ధి చేస్తూ…ఆనాడు తెలంగాణ కు వ్యతిరేకంగా మాట్లాడినవారు ఈనాడు తెలంగాణ అంటే ఇదిరా..అని గొప్పగా మాట్లాడుకునేలా తెలియజేసాడు. ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతగా అభివృద్ధి చేసారో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క హైదరాబాద్ నే కాదు మారుమూల గ్రామం కూడా ఈరోజు ఎంతగానో అభివృద్ధి చెందింది. కొత్త జిల్లాలను తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేయడమే కాదు ఆ చుట్టుపక్కల భూమి ధర పెరిగేలా చేసాడు. ఎన్నో కంపెనీలు ఈరోజు తెలంగాణ లో పెట్టుబడిపెట్టి వేలాదిమందికి ఉపాధిఅవకాశాలు అందిస్తున్నాయి.

రాష్ట్రంలో వరి ఉత్పత్తి లో గాని , కరెంట్ వినియోగంలో గాని , ఉత్పత్తిలో గాని ఇలా ఎందులో చూసిన తెలంగాణ నెం వన్ స్థానం(Telangana No 1)లో ఉండేలా కేసీఆర్ చేసారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ , షాదీ ముబారక్, మన ఊరు – మన బడి , రైతుబంధు , దళిత బంధు , బస్తి దవాఖాన, మిషన్ భగీరధ ఇలా ఎన్నో పధకాలు తీసుకొచ్చి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. ఓ పక్క ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసిన వాటిని తిప్పికొడుతూ..చేసిన అభివృద్ధి , సంక్షేమ పధకాలు , రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులు , కట్టిన ప్రాజెక్ట్ లు..మొన్నటికి మొన్న బీసీ బంధు , మైనార్టీ బంధు ఇలా అన్ని ప్రజల కళ్లముందు ఉంచుతూ ప్రజల వద్ద ప్రతిపక్ష పార్టీలు నోరు మూసుకునేలా చేస్తున్నారు. ఇక తాజాగా జరిగిన కాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొని బిజెపి , కాంగ్రెస్ పార్టీలకు నిద్ర పట్టకుండా చేసాడు.

* రూ.60వేలకోట్లతో హైదరాబాద్‌లో మెట్రోను విస్తరిస్తున్నట్లు ప్రకటన..ఇది నగరవాసులకు ఎంతో గొప్ప శుభవార్త అని చెప్పాలి. హైదరాబాద్ లో ఎన్ని ఫ్లై ఓవర్లు కట్టిన , ఎంత చేసిన ట్రాఫిక్ అనేది అంతకు అంత పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలో మెట్రోను విస్తరిస్తున్నట్లు కాబినెట్ తీసుకున్న నిర్ణయం ఎంతో శుభసూచకం.

* టీఎస్‌ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం..నిన్నటి వరకు ప్రతిపక్ష పార్టీలు టీఎస్‌ ఆర్టీసీ ని కేసీఆర్ ప్రవేట్ పరం చేస్తాడని , ఆర్టీసీ ఉద్యోగులకు పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ వచ్చేవారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తున్నట్లు తెలిపి వారిలో ఆనందం నింపారు.

* అలాగే రాష్ట్రంలో అనాథ పిల్లల సంరక్షణ కోసం అర్బన్ పాలసీ తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మహబూబాబాద్‌లో ఉద్యాన కాలేజీ ఏర్పాటుకు ఆమోదం , హైదరాబాద్‌లో హైబ్రిడ్ విధానంలో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటుకు ఆమోదం , నిమ్స్‌లో రూ. 1800 కోట్లతో మరో 2 వేల పడకల ఏర్పాటుకు నిర్ణయం. బీడీ కార్మికులతోపాటు బీడీ టేకేదారులకు పింఛన్లకు నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేసే నిర్ణయాలే.

* ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వందలాది రైతులు నష్టపోయారు. దీనిపై కాబినెట్ లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తక్షణ సాయం కింద రూ. 500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు ఉద్యోగ ధర్మాన్ని అద్భుతంగా నిర్వర్తించారని.. వారిని ఆగస్టు 15న ప్రభుత్వం సత్కారం చేయనుందన్నారు. అలాగే ఆశ్రమ పాఠశాలలో 40 మంది పిల్లలను కాపాడిన టీచర్‌ను సన్మానిస్తామన్నారు.

* ప్రజలకే కాదు పార్టీలో ఉన్న పలువుర్ని సంతోష పెట్టి..ప్రతిపక్ష పార్టీల నేతల్లో ఆశలు రేపాడు సీఎం కేసీఆర్. రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది కాబినెట్. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ రావులను ప్రకటించారు. వీరు పేర్లను గవర్నర్ కు పంపించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గవర్నర్ ఆమోదం తెలిపితే దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాసోజు శ్రవణ్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అయితే మధ్యలో కాంగ్రెస్ లో చేరి..మళ్లీ ఇప్పుడు సొంత బిఆర్ఎస్ లోనే చేరారు. ఇలా ఎప్పటికప్పుడు కేసీఆర్ వ్యూహాలు రచిస్తూ..ముందుకు వెళ్తున్నారు. మరోపక్క సర్వేలు సైతం ఈసారి ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ విజయం సాదించబోతుందని చెపుతుంది. మరి ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రజలకు ఇంకెన్ని హామీలు ఇస్తారో చూడాలి.

Read Also : Rain Alert Today : ఇవాళ తెలంగాణలోని 13 జిల్లాల్లో వానలు