Site icon HashtagU Telugu

BRS MP: హత్యా రాజకీయాలకు కేసీఆర్ పూర్తి వ్యతిరేకం : ఎంపీ వద్దిరాజు

Nomination Of Vaddiraju Ravichandra As Brs Rajya Sabha Candidate

Nomination Of Vaddiraju Ravichandra As Brs Rajya Sabha Candidate

BRS MP: బీఆర్ఎస్ కార్యకర్త శ్రీనునాయక్ ను హత్య చేయడాన్ని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు,ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ప్రతినిత్యం భౌతికదాడులు జరుగుతున్నాయని,అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఎంపీ రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి ఆదివారం ఖమ్మం తెలంగాణ భవన్ లో విలేఖరులతో మాట్లాడారు.

మహానేత కేసీఆర్ నెత్తురు చిందకుండా తెలంగాణ మహోద్యమాన్ని శాంతియుత పద్దతుల్లో నడిపించి రాష్ట్రాన్ని సాధించి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని వివరించారు.హింసకు, హత్యా రాజకీయాలకు తమ పార్టీ బీఆర్ఎస్, అధినేత కేసీఆర్ పూర్తి వ్యతిరేకమని,ప్రోత్సహించరని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు. జిల్లా మంత్రిపై దాడికి కుట్ర జరిగిందని అనేది శుద్ధ అబద్ధమని, శాంతియుతంగా ఉండే ఖమ్మంలో ఇటువంటి కుట్రలు,దాడులకు తావు లేదనన్నారు.ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా వట్టి మాటేనని, విచారణ జరిపించి నిజానిజాలను నిగ్గు తేల్చాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంట్ లోపల, బయట ప్రతి నిత్యం పోరాడే బీఆర్ఎస్ బీ టీమ్ కాదని,కాబోదని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.