Pocharam: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి, కొల్చారం మండల కేంద్రాలలో ఈరోజు జరిగిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ లలో మెదక్ BRS పార్టీ MP అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తో కలిసి బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ.. దేశంలో 29 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ పంట పెట్టుబడికి రైతులకు రైతుబంధు ఇవ్వాలని ఆలోచించి రైతుబంధు ద్వారా ఎకరాకు పదివేల రూపాయల నగదు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ రైతుబంధు రూ. 10,000 ఇస్తుంటే, అధికారంలోకి వచ్చాక రైతు భరోసా రూ. 15,000 ఇస్తామన్నారు. ఒక్కరికీ ఇవ్వలేదని పోచారం కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను, మహిళలను, ప్రజలను నమ్మించాడని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. కానీ ఇంతవరకు హామీలు అమలు కాలేదని, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్,18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇయ్యలేదని పోచారం మండిపడ్డారు. ఆసరా పెన్షన్ రూ. 4000 కు పెంచుతామమని, నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామని మోసం చేశారని పోచారం ఫైర్ అయ్యారు.