Vaddiraju: శాసనమండలికి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓటేసి గెలిపించాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పట్టభద్రులను కోరారు.రాకేష్ రెడ్డికి పెద్దల సభ శాసనమండలికి ఎన్నిక కావడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయన్నారు.ఆయన దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఒకటిగా పేరొందిన బిట్స్ పిలానీలో చదివిన గోల్డ్ మెడలిస్ట్ అని, అమెరికాలో మంచి వేతనం పొందుతున్న ఉద్యోగాన్ని వదులుకుని ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మహానేత కేసీఆర్ 10ఏళ్ల సుపరిపాలనలో సుమారు 2లక్షల ప్రభుత్వోద్యోగాలిచ్చారని, ఐటీ,ఫార్మా,టెక్స్ టైల్స్,ఎయిరోస్పేస్ తదితర రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలివచ్చాయని, 9లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని వివరించారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం “ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ”గా ముందుకు సాగిందని,73%పీఆర్సీ ఫిట్ మెంట్ ఇచ్చిన విషయాన్ని ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు నెలకొల్పి అన్ని వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియం లో నాణ్యమైన ఉచిత విద్యను అందించడం, విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించేందుకు 20లక్షల రూపాయలు ఉచితంగా అందజేయడం జరిగిందని ఎంపీ వద్దిరాజు చెప్పారు.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని యువకుడు,విద్యావంతుడు, గుణవంతుడు,ఉత్సాహవంతుడు,వక్త,ప్రజల పక్షాన శాసనమండలి లోపల, బయట పోరాడే శక్తి గల రాకేష్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ఎంపీ రవిచంద్ర పట్టభద్రులను కోరారు.బ్యాలెట్ పేపర్ పై సీరియల్ నంబర్ 3 రాకేష్ రెడ్డి పేరు ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు 1వేసి బీఆర్ఎస్ అభ్యర్థికి ఘన విజయం చేకూర్చాల్సిందిగా ఎంపీ రవిచంద్ర పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు