Site icon HashtagU Telugu

Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగుల‌కు మ‌రో గుడ్‌న్యూస్..?

Kcr Telangana Job Notification

Kcr Telangana Job Notification

తెలంగాణ నిరుద్యోగుల‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం వ‌రుస‌గా గుడ్ న్యూస్‌లు చెబుతోంది. ఇటీవ‌ల రాష్ట్ర నిరుద్యోగుల‌కు సీఎం కేసీఆర్ భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రకటనతో పెద్ద చదువులు చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇదే మంచి అవకాశంగా భావిస్తున్నారు.

ఈ నేప‌ధ్యంలో తెలంగాణ‌లో ఉద్యోతాల‌ నోటిఫికేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను తీసుకునే పనిలో ఉంది. దీంతో ఏ క్షణంలోనైనా జాబ్ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని స‌మాచారం. అయితే ఉద్యోగాల నోటిఫికేషన్‌లు విడుదల చేసే ముందు వయో పరిమితి గురించి స్పష్టత రావాల్సి ఉంది. ఈ క్ర‌మంలో తాజాగా ఉద్యోగాల భర్తీ కోసం వయోపరిమితిని పెంచుతామని సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించారు.

అయితే నిరుద్యోగుల‌కు వయోపరిమితి సడలింపుపై కొద్ది రోజుల్లోనే శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఈ క్ర‌మంలో ఏజ్ లిమిట్ కోసం ఇప్పటికే అధికారులు పలు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు స‌మాచారం. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం కోసం పంపినట్లు సమాచారం. దీంతో సీఎం కేసీఆర్‌ ఆమోదముద్ర వేస్తే వయోపరిమితిపై పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వయోపరిమితి ఓసీలకు 34 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 ఏళ్లు ఉంది. అలాగే దివ్యాంగులకు 44 ఏళ్లుగా ఉన్న సంగ‌తి తెలిసిందే.