KCR Trophy: సిద్ధిపేట‌లో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ.. పోటీల‌ను ప్రారంభించ‌నున్న మంత్రి హ‌రీష్‌రావు

తెలంగాణ సీఎం కేసీఆర్ 68వ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని సిద్ధిపేట‌లో సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని భారీ ఎత్తున నిర్వ‌హించ‌డానికి రంగం సిద్ధ‌మైంది.

  • Written By:
  • Publish Date - February 16, 2022 / 09:25 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ 68వ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని సిద్ధిపేట‌లో సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని భారీ ఎత్తున నిర్వ‌హించ‌డానికి రంగం సిద్ధ‌మైంది. గురువారం సిద్ధిపేట‌లోని ఆచార్య జ‌య‌శంక‌ర్ స్టేడియంలో ఈ టోర్న‌మెంట్‌ను రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీష్‌రావు, సినీ హీరో అక్కినేని అఖిల్‌, టీమిండియా మాజీ మేనేజర్, రాష్ట్ర‌ బ్యాడ్మింట‌న్ సంఘం ఉపాధ్య‌క్షుడు చాముండేశ్వ‌ర్‌నాథ్, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి క‌లిసి లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు.

మంత్రి హ‌రీష్‌రావు ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఈ పోటీల్లో 258 జ‌ట్లు, 4 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నార‌ని నిర్వాహ‌కులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కలకుంట్ల మల్లిఖార్జున్ వెల్ల‌డించారు. గురువారం నుంచి 45 రోజుల పాటు జ‌ర‌గ‌నున్నఈ పోటీల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డానికి అన్నీ ఏర్పాట్లు ప‌క‌డ్బందీగా పూర్తి చేశామ‌ని వారు వివ‌రించారు. విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు రూ.ల‌క్ష‌, ర‌న్న‌ర‌ప్ టీమ్‌కు రూ.50 వేలు న‌గ‌దు పుర‌స్కారం ప్ర‌దానం చేయ‌నున్నామ‌ని వారు చెప్పారు. అలానే మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన క్రికెట‌ర్‌కు రూ.25 వేలు, సిక్స‌ర్ బాదిన‌ ఆట‌గాడికి ఒక్కో సిక్స‌ర్‌కు రూ.1000లు న‌గ‌దు బ‌హుమ‌తిగా అందించ‌నున్నామ‌ని తెలిపారు. గత ఏడాది సీఎం కేసీఆర్ ట్రోఫీలో ఆడిన సిద్ధిపేట క్రికెట‌ర్లు అప్రోజ్ , అబ్రామ్ ఇటీవ‌ల హైద‌రాబాద్ రంజీ జ‌ట్టుకు ఎంపిక అయ్యార‌ని చెప్పారు.