Site icon HashtagU Telugu

Telangana: మూడు పార్టీలు మారిన చరిత్ర కేసీఆర్ ది

Telangana

Telangana

Telangana: పార్టీ మారినట్లు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసమే పార్టీ మారానని, ఒక పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరానని స్పష్టం చేశారు. అలాంటప్పుడు పార్టీ మారినట్లు మాట్లాడితే ఊరుకోరనన్నారు.

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర ఆ పార్టీకి ఉందని దుయ్యబట్టారు. పార్టీ మారడంపై బీఆర్ఎస్ సభ్యులు నిత్యం విమర్శలు చేస్తున్నారని.. కేసీఆర్ తన రాజకీయ జీవితాన్ని ఏ పార్టీలో ప్రారంభించారని ప్రశ్నించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి ఎలా వచ్చారు? టీఆర్ఎస్ ఎలా స్థాపించబడింది? మూడు పార్టీలు మారిన చరిత్ర కేసీఆర్ ది అని విమర్శించారు. ఈ విషయాన్ని మరిచిపోవద్దని బీఆర్‌ఎస్ నాయకులు హితవు పలికారు. నేను వేరే పార్టీలోకి వెళ్లి మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీకు అర్థం కాలేదా? నేను పార్టీ మారినప్పుడు.. మీరు ప్రతిపక్షంలోకి వెళ్లారని గుర్తుంచుకోవాలని అన్నారు.

Also Read: Telangana: కిరోసిన్ దీపంతో చదువుకున్న జగదీష్ రెడ్డికి వేల కోట్లు ఎలా వచ్చాయి

Exit mobile version