Site icon HashtagU Telugu

KCR Avoids PM Modi: ముఖం చాటేసిన కేసీఆర్!

Kcr

Kcr

ఆయనో దేశ ప్రధాని.. అధికారిక సమావేశాలు, ఇతర సభల కారణంగా ఏ రాష్ట్రంలోనైనా పర్యటించవచ్చు. అయితే దేశ ప్రధాని అంటేనే ప్రొటోకాల్, భారీ భద్రత కు తగిన ప్రాధాన్యం ఉంటుంది. కానీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న మోడీకి స్వాగతం పలకడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. అయితే అధికారికంగా దేశ ప్రధానికి స్వాగతం చెప్పాల్సిన ఉన్నా.. ఆయన తరచుగా ముఖం చాటేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్ కు రానున్నారు. మరోసారి కేసీఆర్ ప్రధాని టూర్ పట్ల పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదని సమాచారం. దీంతో ముఖ్యమంత్రి స్థానంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మోడీకి వెల్ కం చెప్పనున్నారు. కేసీఆర్ కారణంగా ఇప్పటికే మంత్రి తలసాని రెండుసార్లు మోడీకి స్వాగతం పలికారు. ప్రధాని రాకతో మరోసారి తలసాని స్వాగతం చెప్పనున్నట్టు తెలంగాణ సీఎంవో అధికారికంగా వెల్లడించింది. కేసీఆర్ వ్యవహరంతో టీఆర్ఎస్, బీజేపీకి మరింత దూరం పెరిగిందని చెప్పక తప్పదు. కాగా బేగం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా చేరుకున్నారు. ఆయనకు సీఎం కేసీఆర్ ,రాష్ట్ర మంత్రులు, టీ ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.