Site icon HashtagU Telugu

CM KCR: ములాయం అంత్యక్రియలకు హాజరుకానున్న కేసీఆర్

Cm Kcr Job Notification

Cm Kcr Job Notification

మాజీ ముఖ్యమంత్రి  ములాయం సింగ్ యాదవ్ ఇవాళ ఉదయం తుద్విశాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అయితే  రేపు జరుగబోయే ములాయం అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. ఉత్తర ప్రదేశ్, ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయ్ కు మంగళవారం (రేపు 11.10.22) మధ్యాహ్నం సీఎం చేరుకోనున్నారు. దివంగత ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళుర్పించనున్నారు. అనంతరం అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.