Site icon HashtagU Telugu

Breakfast Scheme : దసరా నుంచి ప్రభుత్వ స్కూళ్ల స్టూడెంట్స్ కు అల్పాహారం.. కేసీఆర్ ప్రకటన

kcr-ordered-cs-to-send-helicopt

kcr-ordered-cs-to-send-helicopt

Breakfast Scheme : తెలంగాణలోని గవర్నమెంట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ వినిపించారు. దసరా కానుకగా “ముఖ్యమంత్రి అల్పాహార పథకం”  ప్రకటించారు. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు దసరా నుంచే అల్పాహార పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా దాదాపు రూ. 400 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

Also read : IND vs BAN: శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీ వృథా.. ఉత్కంఠ పోరులో టీమిండియా ఓట‌మి

ఈ తరహా పథకం ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోంది. తమిళనాడు గవర్నమెంట్ స్కూళ్లలో అల్పాహార పథకాన్ని ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకునేందుకు ఐఏఎస్ అధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్ ఇటీవలే ఆ రాష్ట్రానికి పంపించారు. ఆ పథకాన్ని అధ్యయనం చేసిన తెలంగాణ ఉన్నతాధికారుల టీమ్..  రాష్ట్ర సర్కారుకు ఒక  నివేదికను సమర్పించింది. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్ అందరికీ టిఫిన్ ను (Breakfast Scheme) అందచేయాలని కేసీఆర్ డిసైడ్ చేశారు.