BRS MP Candidates: భువనగిరి, నల్గొండ MP అభ్యర్థులను ప్ర‌క‌టించిన కేసీఆర్‌

దేశంలో లోక్‌స‌భ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం నెల‌కొంది. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ )BRS MP Candidates) అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది.

  • Written By:
  • Updated On - March 23, 2024 / 06:07 PM IST

BRS MP Candidates: దేశంలో లోక్‌స‌భ ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం నెల‌కొంది. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ )BRS MP Candidates) అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. ఇప్పటికే ప‌లు పార్ల‌మెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ ఇప్పుడు మరో ఇద్దరికి అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ మరో రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. భువనగిరి నుంచి క్యామ మల్లేశ్, నల్గొండకు కంచర్ల కృష్ణారెడ్డిని అభ్యర్థులుగా పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు.

Also Read: Ajith: వారి కోసం ప్రేమతో బిర్యానీ చేస్తున్న హీరో అజిత్.. వీడియో వైరల్?

వీరిద్ద‌రితో క‌లిపి మొత్తం 17 ఎంపీ స్థానాల‌కు గాను 16 మంది ఎంపీ అభ్య‌ర్థుల‌ను గులాబీ బాస్ ప్ర‌క‌టించారు. ఇక హైదరాబాద్ పార్ల‌మెంట్ స్థానానికి మాత్ర‌మే ఎంపీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇక ఇటీవ‌ల పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ టికెట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. మొన్న‌టి దాకా టికెట్లపై క‌స‌ర‌త్తు చేసిన కేసీఆర్ ఎన్నిక‌ల షెడ్యూల్ రాగానే వ‌రుస‌పెట్టి ఎంపీ అభ్య‌ర్థుల పేర్ల‌ను విడుద‌ల చేస్తూ వ‌చ్చారు.

గ‌తేడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైన బీఆర్ఎస్ పార్టీ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ కాంగ్రెస్‌కు గ‌ట్టి పోటీని ఇవ్వాల‌నే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారు. అందుకోస‌మే ఇప్ప‌టివర‌కు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల రాజ‌కీయ చ‌రిత్ర‌, ప్ర‌జ‌ల్లో వారికున్న ప‌లుకుబ‌డి, సామాజిక‌వ‌ర్గాల స‌మీక‌ర‌ణ‌, త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించి టికెట్ల‌ను కేటాయించారు. అయితే వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి మూడు కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు రావ‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. మ‌రోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే 9 మంది ఎంపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

We’re now on WhatsApp : Click to Join

తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్‌

నామినేషన్లు ప్రారంభ తేదీ- ఏప్రిల్‌ 18
నామినేషన్ల చివరి తేదీ- ఏప్రిల్‌ 25
పోలింగ్ తేదీ- మే 13
ఎన్నికల ఫలితాలు- జూన్‌ 4