Bandi Sanjay: సాక్షాల ఆధారంగా కవితకు నోటీసులిచ్చారు : బండి సంజయ్

  • Written By:
  • Publish Date - February 26, 2024 / 11:24 PM IST

Bandi Sanjay: కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో అయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 370 ఎంపీ సీట్లు సాధించబోతున్నాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండో విడత ప్రజాహిత యాత్రను ప్రారంభించాం. మలిదశ యాత్ర హుస్నాబాద్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో పూర్తి చేస్తామని అన్నారు. తొలిదశ యాత్రకు అపూర్వ స్పందన లభించింది. కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నం. సీబీఐ, ఈడీని శాసించే అధికారం బీజేపీకి లేదు… అవి స్వతంత్య్ర విచారణ సంస్థలు.సీబీఐ సేకరించిన ప్రాథమిక ఆధారాలు, సాక్షాల ఆధారంగా కవితకు నోటీసులిచ్చారని అన్నారు.

ఆధారాలుంటే ఎంత పెద్దవారైనా ఉపేక్షించ కూడదన్నదే బీజేపీ విధానం. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం నడుస్తోంది. గతంలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేసిన చరిత్ర ఆ పార్టీలదే. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇట్లాంటి ప్రచారం చేసి లబ్ది పొందాలని చూశారు. బీజేపీ 5, 6 రోజుల్లో ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించబోతోంది. ఇంకా బీఆర్ఎస్ తో పొత్తు ఎక్కడిది? బీఆర్ఎస్ తో పొత్తు అంటే చెంపల పగలకొట్టాలి..చెప్పుతో కొట్టాలని నేనే చెబుతున్నా.

కరీంనగర్ నియోజకవర్గానికి వినోద్ కుమార్ చేసిన అభివ్రుద్ధి ఏమిటో చెప్పాలి. గ్రామాల వారీగా చేసిన అభివ్రుద్ది, కేంద్ర విజయాలతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ ప్రధానిగా మోదీని చేయడమే లక్ష్యంగా ప్రజాహిత యాత్ర సాగుతుందన్నారు.